![]() |
![]() |
.webp)
జ్యోతి రాయ్.. ఈ పేరు విని ఉండకపోవచ్చు గానీ జగతి మేడం అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది.
జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది.
ఈ మధ్య తన పర్సనల్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో చేసిన కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారని, అలా వద్దని.. తన పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషన్ కి సంబంధం లేదంటు చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది జ్యోతిరాయ్. తాజాగా తను చేస్తోన్న ఒక వెబ్ సిరీస్ డైరెక్టర్ తో కలిసి దిగిన ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన జ్యోతిరాయ్.. ఈ విషయాన్ని షేర్ చేసింది. " డోంట్ క్రిటిసైజ్ వాట్ యూ డోంట్ అండర్ స్టాండ్, యు నెవర్ వాక్డ్ ఇన్ మై షూస్, రిమెంబర్" అంటూ రాసింది జ్యోతిరాయ్. నటన రంగంలో తను చేస్తుందని దానిని పర్సనల్ లైఫ్ కి లింక్ చేయొద్దని ఇప్పటికే చెప్పిన జ్యోతిరాయ్ ఈ సారి ఇలా బోల్డ్ రిప్లై ఇచ్చింది. మరి అలా నెగెటివ్ కామెంట్లు చేసే కొందరు నెటిజన్లు ఈ పోస్ట్ చూసి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.
![]() |
![]() |